కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి అవసరమయ్యే తాగు, సాగునీటినీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు ఈ నీరు వెళ్తుంది. తాగునీటికి అవసరమైన పథకాలకు, రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు చెరువులు, కుంటలకు నీరు నింపేందుకు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈప్రాంతానికి నీరు తీసుకురావటం జరుగుతుందన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దృఢనిశ్చయంతో ఉన్నారన్నారు.
ఇవీ చదవండి