కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం... 20 లక్షల రూపాయల విలువైన అంబులెన్స్‌ను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎంపీ నిధుల నుంచి అందజేశారు. 15 లక్షలతో సీసీ కెమెరాల వ్యవస్థను ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. సీఎం రమేశ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్యాలరావు వీటి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అంబులెన్స్ కు పూజలు చేసిన వాహనాన్ని స్వయంగా నడిపి ప్రారంభించారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు.
ఇది కూడా చదవండి