కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా రామయ్య పాలెంలో నిర్వహించిన 'వనం-మనం' కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎటువంటి అవకతవకలు లేకుండా నియామకాలు చేపట్టామన్నారు. రైల్వేకోడూరు చుట్టుపక్కల గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి 90శాతం నెరవేర్చారని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.
ఇదీ చూడండి: 'అపోహాలు వద్దు... అందరికీ న్యాయం చేస్తాం'