తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు 14 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో అండగా ఉన్నారని.. బీటెక్ రవి అన్నారు. ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి.. జగన్ ఆయనను మంత్రిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
అన్యాయం జరుగుతోంది
కడప స్టీల్ ప్లాంట్ల్లో భూనిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థులకు నష్టపరిహారం ఇవ్వకుంటే.. నిర్వాసితులను తాడేపల్లి తీసుకెళ్లి సీఎంను నిలదీస్తామని అన్నారు.
ఎమ్మెల్యేకు ముడుపులు అందుతున్నాయి
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇసుక అక్రమ రవాణాలో ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. అక్రమాలపై కాణిపాకంలో గాని జమ్మలమడుగులోని ఏ ఆలయంలోనైనా సరే ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ప్రస్తుతం 22 మంది వైకాపా ఎంపీలు ఉన్నారని.. ప్రత్యేక హోదా కోసం వారందరితో ఎందుకు రాజీనామా చేయించేలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ