కడప జిల్లా రైల్వేకోడూరులో ఓ పత్రికలో ప్రచురితమైన 'పంచుడు, తుంచుడు' కథనాలపై పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలపై ఆ పత్రికలో వస్తున్న అసత్య కథనాలపై ఆయన కంప్లైట్ చేశారు. చంద్రబాబు ఫోర్త్ పిల్లర్‌గా చెప్పుకునే మీడియాను వాడుకొని తప్పుడు కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. 94 శాతం హామీలు రెండు సంవత్సరాలలో నెరవేర్చి ప్రజల అభిమానం పొందుతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు… కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి. AP EAP SET: సెప్టెంబరులో ఏపీ ఈఏపీ సెట్!