కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరగింది. నగరంలోని రవీంద్ర నగర్‌కు చెందిన షేక్ మునార్ జాన్ 8 లక్షల విలువైన బంగారు నగలతో పులివెందులలో ఆర్టీసీ బస్ ఎక్కి కడపకు బయలుదేరింది. మార్గ మధ్యలో ముగ్గురు మహిళలు బస్ ఎక్కి మునార్ జాన్ పక్కనే కూర్చున్నారు. కడప మరియపురం వద్ద మునార్ జాన్ బస్ దిగుతుండగా బ్యాగులోని నగలు తస్కరించారు. ఆమె ఇంటికి వెళ్ళి చూడగా... నగలు కనిపించ లేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: