కడప జిల్లా వేంపల్లిలోని గండిరోడ్డులో సుజాత అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికు చెందిన సుజాత, వేంపల్లివాసితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రి సుజాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ఉదయం నిద్రలేచి చూడగా...మృతి చెందినట్లు చెబుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా స్ధానిక గండి రోడ్లో బట్టల షాప్ పెట్టుకుని జీవనం సాగించేవారు.
వేంపల్లిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య - వేంపల్లిలో వివాహిత ఆత్మహత్య
కడప జిల్లా వేంపల్లిలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.