కడప జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని కోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాలలో, జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలోని నందలూరు, మైలవరం, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, పెద్దముడియం, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, చిట్వేలి, పెనగలూరు.. మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెదేపా ఎన్నికలు బహిష్కరించటంతో.. పోలింగ్ బూత్‌లలో అధికార పార్టీ ఎజెంట్లే ఎక్కువగా ఉంటున్నారు.
బద్వేలు మండలం ఉప్పవారిపల్లిలో తెదేపా జెడ్పీటీసీ అభ్యర్థి బీరం శిరీష పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. తమ పార్టీ ఏజెంట్లను కూర్చొని ఇవ్వకపోవడంపై పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. తమ పార్టీ ఏజెంట్లను కూర్చోపెట్టే వరకు ఇక్కడినుంచి కదలనని ప్రకటించారు.
రైల్వేకోడూరు మండలంలోని మైసూరువారిపల్లిలో తాము ఓట్లు వేసేందుకు వెళితే అడ్డుకున్నారంటూ ఆ ఊరి జనసేన మద్దతు ఉప సర్పంచ్ ఆరోపణలు చేశారు. దీంతో జనసేన, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి సర్ది చెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండీ.. పరిషత్ పోరు: ఉదయం 11 గంటలకు 21.65 శాతం పోలింగ్