కడప జిల్లా పెద్దముడియం మండలం బలపన గూడూరు గ్రామంలో దారుణం జరిగింది. చిదిపిరాళ్లదిన్నే గ్రామానికి చెందిన షేక్ అక్బర్ బాషా తన భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భరించలేక అతని భార్య తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బలపన గూడూరు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిన విషయాన్ని భరించలేని అక్బర్ బాషా.. ఆవేశంలో అక్కడికి వెళ్లి కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో అతని మామ ఇమామ్, తన నాలుగేళ్ల కూతురు రిహానా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. నిందితుడు ద్విచక్ర వాహనంలో పారిపోతుండగా అదుపుతప్పి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి