కడప జిల్లా ప్రొద్దుటూరులో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. అత్యవసరైతే తప్ప మిగిలిన సమయంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బయట ప్రాంతాల వారు ప్రొద్దుటూరుకు రాకుండా, ఇక్కడి వారు బయటకు వెళ్లకుండా చూస్తున్నామని చెప్పారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్యావసర సరుకులు అవసరమైతే కమాండ్ కంట్రోల్‌కు సమాచారం ఇస్తే పురపాలక, రెవెన్యూ అధికారుల సహకారంతో డోర్ డెలివరీ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి.. పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: