సరకులు రవాణా చేసే కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన కార్గో బస్సులో 23 మద్యం సీసాలను శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దువ్వూరు మండలం కానగూడూరు నుంచి హైదరాబాద్కు పూల బస్తాలతో కార్గో బస్సు వెళ్లింది. బస్సు తిరిగొస్తున్న సమయంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కార్గో బస్సుకు చెందిన ముగ్గురు డ్రైవర్లతోపాటు పూల వ్యాపారికి ఇందులో భాగస్వామ్యమున్నట్లు కడప ఆర్టీసీ డీఎం తెలిపారు.
ఇవీ చదవండి..