కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.3.50 కోట్లతో పాటు.. మరో బస్సులో తరలిస్తున్న రూ. 55.71 లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. చేతన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చెన్నైలోని రామచంద్ర మెడికల్ కళాశాలకు చెందిన నగదుగా నిందితుడు చెప్పినట్లు కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ నగదును ఆదాయపన్నుల శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.
మరో బస్సులో... సుమారు కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 55 లక్షలా 71 వేల రూపాయలు. కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన పీఎంజే జేమ్స్ జ్యూవెలర్స్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.
ఇదీ చదవండి: