ETV Bharat / state

VIVEKA MURDER CASE: వివేకా హత్య కేసులో దస్తగిరికి ముందస్తు బెయిలు - వైఎస్ వివేకా హత్యకేసు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక అనుమానితుడైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరికి కడప కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఇతన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో కడప కోర్టులో దస్తగిరి ముందుస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్  వివేకానందరెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి
author img

By

Published : Oct 22, 2021, 7:23 PM IST

Updated : Oct 23, 2021, 4:12 AM IST

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన వివేకా మాజీ డ్రైవర్‌, పులివెందులకు చెందిన దస్తగిరికి కడప నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు శుక్రవారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రెండు నెలల కిందట సీబీఐ అధికారులు దస్తగిరిని ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు. తనను అరెస్టు చేస్తారనే భయంతో దస్తగిరి నాలుగు రోజుల కిందట కడప నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో ముందస్తు బెయిలుకు పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో న్యాయమూర్తి ముందస్తు బెయిలు మంజూరు చేశారు.

ఇదీ చదవండి: Viveka Murder Case: సీబీఐ విచారణకు సునీల్​ యాదవ్​ బంధువు

Last Updated : Oct 23, 2021, 4:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.