'ఆ నిధులు రాబట్టడానికి కృషి చేస్తా' - మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పై కేశవ రెడ్డి పాఠశాల చైర్మన్ మధుసూదన్ రెడ్డి విమర్శలు
రెండు తెలుగు రాష్ట్రాలలో కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు 260కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని కేశవ రెడ్డి పాఠశాల చైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిధులు చెల్లించకుండా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మోసం చేశారన్నారు. ఆదినారాయణ రెడ్డి... తనకు కేంద్ర మంత్రి అండదండలు ఉన్నాయని, తనని ఎవరు ఏమి చేయలేరని అంటున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ నిధులు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.