ETV Bharat / state

కోదండరాముని కల్యాణానికి 52 ఎకరాల్లో ఏర్పాట్లు

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న కోదండరాముని కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒంటిమిట్టలో కోదండ రాముని కల్యాణానికి తితిదే సంసిద్ధమైంది.

కోదండరాముని కల్యాణం
author img

By

Published : Apr 14, 2019, 6:27 AM IST

ఒంటిమిట్ట దేవస్థానం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న కోదండరాముని కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేస్తోంది. 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదిక, భక్తులు కూర్చోవడానికి జర్మన్ తరహా షెడ్లను సిద్ధం చేస్తోంది. గత ఏడాది అమర్చిన తాత్కాలిక షెడ్లు వర్షబీభత్సానికి ఎగిరిపడి నలుగురు భక్తులు చనిపోయారు. అలాంటి ఘటన పునరావృతం కాకుండా... గాలివానను తట్టుకునే విధంగా జర్మన్ తరహా షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పురాణాల్లో చెప్పినట్లు.. కోదండరాముడి కల్యాణోత్సవాన్ని చంద్రుడు తిలకించాలనే ఉద్దేశంతో ఆరుబయటే స్వామివారి కల్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. 50 వేల మంది భక్తులు కల్యాణ వేదిక దగ్గర్లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది కల్యాణ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరు పట్టు వస్త్రాలు ఇస్తారనే అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్... ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిపై స్పష్టత వస్తుంది.

Intro:Ap_Nlr_02_13_Saibaba_Usthavam_Kiran_Av_C1

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ దగ్గరున్న శ్రీ సాయి మందిరంలో గంధ మహోత్సవం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై సాయినాధునికి నగరోత్సవం నిర్వహించారు. ప్రధాన మార్గాల్లో సాగిన ఈ నగరోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముస్లిం సోదరులు గ్రంధాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి సాయినాధునికి లేపనం పట్టారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.