కడప జిల్లా రాజుపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29న అయ్యవారిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇందులో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి.
ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఒక వర్గానికి చెందిన ఐదు మందిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలతోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని తెలిపారు. ఇందులో రాజకీయ పార్టీల పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పలువురిని ప్రశ్నిస్తున్నామని.. మరింత మందిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Viveka murder case: దర్యాప్తు వేగవంతం.. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషణ