కొవిడ్ టీకా సురక్షితమైందని.. ఆందోళనవద్దని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడప పోలీస్ ఆసుపత్రిలో సిబ్బందికి కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట అదనపు ఎస్పీ ఖాసిం హుస్సేన్ టీకా వేయించుకున్నారు.
కొవిడ్ సమయంలో సిబ్బంది మంచిగా విధులు నిర్వహించారని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. పోలీసు సిబ్బంది అందరికీ టీకా వేయిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ టీకా గురించి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఇదీ చదవండి: మనబడి నాడు-నేడులో సీఎం జగన్ కీలక నిర్ణయం