కడప జిల్లాలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రిమ్స్ కొవిడ్ కేంద్రంలో వైద్యులు, సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు చాలా వరకూ ఆస్పత్రి సమీపంలోని గుంతలో దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది పీపీఈ కిట్లను గుంతలో పడేస్తున్నారు. వాటిని కాల్చి పడేయాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. వాటిని పశువులు మేస్తున్నాయి.
దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే కరోనా వ్యాప్తిని ఎలా అరికడతారని ప్రశ్నిస్తున్నారు. రోజూ ఇదే తంతు నడుస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి..