కరోనా నేపథ్యంలో పింఛన్దారులు పీఎఫ్ కార్యాలయానికి రావడం ఇబ్బందికరంగా మారింది. దాంతో సంబంధిత పోస్టాఫీసుల్లో, మీ సేవ కేంద్రాల్లో కూడా జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించే అవకాశం కల్పించినట్లు కడప భవిష్యనిధి కమిషనర్ అవినాష్ కుమార్ తెలిపారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలతో కలిపి సుమారు 90 వేల మంది పింఛన్దారులున్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్య నిధి పరిధిలోకి వచ్చే వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: