ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కరోనా వైద్యం అధ్వానంగా ఉందని కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ప్రజల ప్రాణాలు గాలిలో వదిలేశారన్నారు. కోవిడ్ సమీక్ష నిమిత్తం బుధవారం కడపకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కనీసం ఒక్క కోవిడ్ హస్పిటల్ను తనిఖీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఆన్లైన్ ద్వారా బాధితులతో మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఖండించారు. క్వారంటైన్లో సరైన సౌకర్యాలు లేక పాజిటివ్ బాధితులు అల్లాడుతున్నారన్నారు. డిచార్జ్ అయిన తర్వాత కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విమర్శించారు. రిమ్స్ లో కనీసం వెంటిలేటర్లు లేవని చెప్పడం దారుణమని ఖండించారు. రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులుపై ఉన్న శ్రద్ధ కరోనాపై ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి