ETV Bharat / state

'పులివెందుల కాల్పుల ఘటన.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తాం' - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

gun shooting incident in Pulivendula latest news: వైఎస్సార్ జిల్లా పులివెందులలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి భయోత్పతాన్ని కల్గించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఘటనకు సంబంధించి నేటికీ విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వ్యక్తికి పోలీసులు, జిల్లా ఎస్పీ తుపాకీ లైసెన్స్ ఎలా మంజూరు చేశారు..?, ఎందుకు మంజూరు చేశారు..? అంటూ తెలుగుదేశం పార్టీ నిలదీసింది. కడప జిల్లాలో దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారని..అన్నీ ఆధారాలను సేకరించి, త్వరలోనే 'పులివెందుల కాల్పుల ఘటన.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని.. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పలు సంచలన విషయాలను వెల్లడించారు.

gun
gun
author img

By

Published : Apr 3, 2023, 4:46 PM IST

gun shooting incident in Pulivendula latest news: అసాంఘిక శక్తుల చెంత తుపాకులు ఉంటే.. క్షణికావేశంలో ఎదుటివారిని కాల్చి చంపడానికి సైతం వెనకాడరు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన కడప జిల్లా పోలీసులు.. నిబంధనలను పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో దాదాపు 180 మందికి.. తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్‌లకు అనుమతులు ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇటీవలే పులివెందులకు చెందిన భరత్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరిపై తుపాకీతో కాల్పులు జరిపి.. ఒకరి మృతికి కారకుడయ్యాడు. ఆ ఘటన విషయంలో పోలీసుల ఉదాసీనతే కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఉదారంగా ఇచ్చిన తుపాకీ లైసెన్సులపై త్వరలోనే ఆధారాలతో సహా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

తుపాకీ లైసెన్స్ ఎవరికీ మంజూరు చేస్తారు..?: ప్రాణాలకు ముప్పు ఉందని భావించినపుడు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు, ప్రముఖ ప్రజాప్రతినిధులకు, శత్రువులతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినవారికి అన్నీ పరిశీలించిన తర్వాతే పోలీసులు తుపాకీ లైసెన్స్ మంజూరు చేస్తారు. కానీ, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మాత్రం పోలీసులు.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఇష్టారాజ్యంగా తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్‍‌లను కేటాయించారనే విమర్శలు దండిగా ఉన్నాయి. ఐదు రోజుల క్రితం పులివెందులకు చెందిన ఓ దినపత్రిక విలేఖరి, వైసీపీ ముఖ్యనేతల సన్నిహితుడైన భరత్ యాదవ్ అనే వ్యక్తికి పోలీసులు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయడంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్నందున తన ప్రాణానికి ముప్పు ఉందనే సాకుతో.. తుపాకీ లైసెన్స్ మంజూరు చేయించుకున్న భరత్ యాదవ్.. చిన్నపాటి గొడవకే ఇంటికి వెళ్లి, తుపాకీని తెచ్చి ఇష్టారాజ్యంగా పట్టపగలు పులివెందుల్లో కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

ఒక్క పులివెందులలోనే 180 తుపాకీ లైసెన్సులు: ఆ ఘటన తర్వాతే ఆ కాల్పుల్లో దిలీప్ అనే వ్యక్తి చనిపోగా.. మహబూబ్ బాషా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఏడాది నుంచి తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని అభ్యర్థించినా పట్టించుకోని పోలీసులు.. భరత్ యాదవ్ కాల్పుల తర్వాతనే తనకు గన్‌మెన్ కేటాయించారని పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్‌లను కేటాయించగా.. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 180 మందికి తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్‌లను ఇచ్చారని రాంగోపాల్ రెడ్డి వెల్లడించారు. అన్నీ కూడా వైసీపీ నాయకులు, కేసులు ఉన్నవారికి, దొంగలు, దోపిడీదారులు, అసాంఘిక శక్తులకే కేటాయించారని ఆరోపించారు.

ఆ ఆంతర్యం ఏమిటో పోలీసులు చెప్పాలి: ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.''పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో 28 మంది వైసీపీ నాయకులకు తుపాకీ లైసెన్సులు ఇచ్చారు. వేముల మండలంలో 11 మందికి, వేంపల్లె మండలంలో 39 మందికి, పులివెందుల మండలంలో 84 మందికి, లింగాల మండలంలో 8 మందికి, తొండూరు మండలంలో ముగ్గురికి తుపాకీ లైసెన్సులు ఇచ్చారు. కడప జిల్లా పోలీసులు అత్యుత్సాహం, ఎస్పీ ప్రత్యేక చొరవతో పులివెందుల పోలీస్ స్టేషన్లలో కేసులు, హత్యాయత్నాలు చేసిన 20 మందికి తుపాకీ లైసెన్సులు ఎలా ఇచ్చారు..?, ఏడాది కిందటే తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలకు మంజూరు చేయకపోవడం వెనక ఆంతర్యం ఏంటి..?'' అని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

త్వరలోనే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేస్తాం: తుపాకీ లైసెన్స్ కోసం ఎవరైనా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే.. పోలీసుల ద్వారా విచారణ జరిపించి.. ఎస్పీ సిఫారసు మేరకు లైసెన్స్ మంజూరు చేస్తారు. స్టేట్ రివ్యూ కమిటీ నిబంధనలను పక్కన పెట్టిన కడప ఎస్పీ జిల్లాలో అసాంఘిక శక్తుల చేతులకు తుపాకులు ఇచ్చారని.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. గతంలో భరత్ యాదవ్ తుపాకీ లైసెన్స్ కోసం 2021 ఏప్రిల్ 16న దరఖాస్తు చేసుకుంటే.. గత ఏడాది అక్టోబరు 17న మంజూరు చేశారన్నారు. అతనికి లైసెన్స్ ఇవ్వకూడదని నిఘా, స్పెషల్ బ్రాంచ్ అధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ.. కడప ఎస్పీ విచక్షణాధికారం ఉపయోగించి లైసెన్స్ మంజూరని చేశారని వ్యాఖ్యానించారు. జిల్లాలో తుపాకీ లైసెన్సుల వ్యవహారంపై ఆధారాలను సేకరించి.. త్వరలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

అసలు ఏం జరిగిదంటే: వైఎస్సార్ జిల్లా పులివెందులలో గత నెల (మార్చి) 29వ తేదీన తుపాకీ కాల్పుల మోతలు కలకలం రేపిన విషయం తెలిసిందే. భరత్‌ కుమార్ యాదవ్ అనే వ్యక్తి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో తన వద్దనున్న తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై దాదాపు ఐదురౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో దిలీప్ అనే వ్యక్తి, మహబూబ్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమాధ్యలో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఘటనతో వైఎస్సార్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో కాల్పుల ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. జిల్లా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం విలేఖరిగా విధులు నిర్వర్తీసున్న భరత్‌ కుమార్ యాదవ్‌కు పోలీసులు లైసెన్స్ తుపాకీని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మరోసారి కడప జిల్లా పోలీసులు.. నిబంధనలను పక్కనబెట్టి దాదాపు 180 మందికి తుపాకీ లైసెన్సులు మంజూరు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.