'కడప' జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలు - కడప జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగో మహాసభలు వార్తలు
కడప జిల్లా మైదుకూరులో ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాలుగో మహాసభ నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా షాదీఖానా వరకు ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు, కార్మిక నాయకులు, ఏఐటీయూసీ ప్రతినిధులు పాల్గొన్నారు.