కడప జిల్లాలో ఉన్న అన్ని స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలను పెంచాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ (రెవెన్యూ) గౌతమితో కలిసి.. కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా స్థాయి శాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశాన్ని నిర్వహించారు.
వినియోగదారులకు ఎలాంటి కొరత లేకుండా జిల్లాలోని అన్ని ఇసుక డిపోలలో నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక నిల్వలు పెంచాలని ఆదేశించారు. ఇసుక డోర్ డెలివరీ నిర్వహణ నిరంతరాయంగా సాగించాలని సూచించారు.
కొత్తగా 8 ఇసుక రీచ్‌లు
రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పాలసీ -2019కి అనుగుణంగా జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలైన వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ, కొండాపురం మండలంలోని పొట్టిపాడు, బెడుదూరు రీచ్‌లుగా గుర్తించారు. ప్రొద్దుటూరు మండలంలోని రేగులపల్లి, సిద్దవటం మండల పరిధిలోని జంగాలపల్లి-2, నందలూరు మండపం పరిధిలో ఆడపూరు-3, కుమారునిపల్లి-1, కుమారునిపల్లి-2, కుమారునిపల్లి-3.. మొదలైన ఎనిమిది ఇసుక రీచ్‌లను కొత్తగా గుర్తించామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
ఇదీ చదవండి