వైకాపాలో కొనసాగుతూ అదే పార్టీపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణరాజుతో మాజీ మంత్రి , భాజపా నాయకుడు ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం దిల్లీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో కడప జిల్లాకు చెందిన భాజపా నాయకులు, ఆదినారాయణ రెడ్డి సమావేశమయ్యారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వీరిరువురి మధ్య ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయో తెలియరాలేదు. ఈ సమావేశ విషయంపై ఈటీవీ భారత్ ప్రతినిధి ఆదినారాయణరెడ్డిని వివరణ కోరగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి తామిద్దరూ చాలా మంచి స్నేహితులు అనీ.. మంగళవారం రోజున హఠాత్తుగా తారసపడడంతో ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి తాడేపల్లి అంత:పురానికి వచ్చిందెవరు?: అయ్యన్న