కడప పెద్ద దర్గాను ఈనెల పదో తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు దర్గా నిర్వాహకులు వెల్లడించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ... ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. దర్గాకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రార్థనలకు వచ్చే వారికి శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. దర్గాలో ఎటువంటి తీర్థప్రసాదాలు ఉండవనీ... కేవలం దూరం నుంచే దర్శించుకుని వెళ్లాలని భక్తులకు సూచించారు. ఉదయం ఐదున్నర నుంచి 9 గంటల వరకు... తిరిగి సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్గా తెరిచి ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: కుమారుడి నుంచి కాపాడండి..పోలీసులకు తల్లి మొర