ETV Bharat / state

'మెడికోలం మేం.. పట్టు వదలం - kadapa

ఎన్​ఎమ్​సీ బిల్లు రద్దు చేసేంతవరకూ మా ఆందోళనలు విరమించేది లేదంటున్నారు ఇండియన్ మెడికల్ అసోసియోషన్ నేత డా.సుధాకర్ రెడ్డి

ఎన్​ఎమ్​సీ బిల్లు పూర్తిగా రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగింపు
author img

By

Published : Aug 8, 2019, 5:50 PM IST

ఎన్​ఎమ్​సీ బిల్లు పూర్తిగా రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగింపు

నూతనంగా తీసుకోవచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ను రద్దు చేయాల్సిందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ సుధాకర్ డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రి లో బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో భవిష్యత్తులో వైద్య విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆరు సంవత్సరాల పాటు రేయింబవళ్లు కష్టపడి ఎంబిబిఎస్ చదివిన విద్యార్థులు చివరి సంవత్సరంలో కళాశాల పరీక్షలతో పాటు మళ్లీ ఎగ్జిట్ పరీక్ష రాయాల్సి ఉండటం దురదృష్టకరమని అన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉండంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతున్నారని సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాను తగ్గించి యాజమాన్యానికి 80 శాతం సీట్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం మరో దారుణమన్నారు.ఈ బిల్లును రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జూడాలతో వ్యవహరించే తీరు ఇదేనా?: పవన్​కల్యాణ్

New Delhi, Aug 08 (ANI): While talking about the Pakistan's decision to suspend trade with India, Congress leader Adhir Ranjan Chowdhury said that Kashmir is an internal matter of the India and country has the right to decide which law to pass in the nation. He also added that he already knew that the Pakistan will do smoothing after Article 370 was revoked. The Centre scrapped Article 370 which gave Jammu and Kashmir special status.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.