ETV Bharat / state

'అపోహలు వీడి నిర్భయంగా వాక్సిన్ వేయించుకోవాలి' - జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ తాజా సమాచారం

కడప జిల్లాలో ప్రతి ఒక్కరు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. వ్యాక్సినేషన్ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. నకాష్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సాయికాంత్ వర్మ తల్లిదండ్రులు టీకా వేయించుకున్నారు.

joint collector saikant varma
అపోహలు వీడి నిర్భయంగా వాక్సిన్ వేయించుకోవాలి
author img

By

Published : Mar 12, 2021, 10:56 PM IST

కడప జిల్లాను కొవిడ్ రహిత జిల్లాగా తీర్చి దిద్ధేందుకు ప్రతి ఒక్కరూ అపోహలు వీడి నిర్భయంగా వాక్సిన్ వేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని నకాష్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో సాయికాంత్ వర్మ తల్లిదండ్రులు టీకా వేయించుకుని.. జిల్లాలోని జిల్లా ప్రజల్లో స్ఫూర్తిని నింపారు.

ప్రస్తుతం జిల్లాలో మూడవ విడతలో 60 ఏళ్లు దాటిన వారికి, 45 - 59 ఏళ్ల వయస్సు మధ్యలో వుండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయటం జరుగుతోందన్నారు. తమ వెంట ఏదేని గుర్తింపు కార్డుతో పాటు.. గుర్తింపు పొందిన వైద్యుల చేత జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్​ను తీసుకెళ్లి టీకా వేయించుకోవచ్చన్నారు. ఈ మూడవ విడత వ్యాక్సినేషన్ టీకాలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వేస్తారన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న 29 ఆసుపత్రులలో ఒక డోసుకు రూ.250 లు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యకు సీఎం జగన్ పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.