ETV Bharat / state

రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ - రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ

తన వ్యాఖ్యలతో అందరిలోనూ ఆసక్తిని పెంచే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమలం పార్టీ ప్రభంజనం మొదలైందని అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన... భాజపా ఎదుగదలలో తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కొంత పరోక్షంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రమాదమని జోస్యం చెప్పారు.

jc-diwakar-reddy-intresting-comments-on-state-politics-bjp-role
author img

By

Published : Sep 14, 2019, 1:52 PM IST

Updated : Sep 14, 2019, 2:53 PM IST

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైందని తెలిపారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చని... లేదా నామమాత్రంగానైనా ఉండొచ్చని అభిప్రాయప్డారు. దాంట్లో తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కొంత పరోక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో భాజపా ఎదుగుదల ఆధారపడి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయని... జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. భాజపాలో చేరికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ....తాను భాజపాలోకి ఎందుకు వెళ్తానని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు.

రాష్ట్రంలో భాజపా ప్రభంజనం మొదలైంది: జేసీ

Intro:యాంకర్ వాతావరణ మార్పుల కారణంగా గ్రామీణ ప్రాంతాలు జ్వరాలతో వణుకుతున్నాయి దీనిలో భాగంగానే విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి జ్వర పీడిత లతో కిటకిటలాడుతోంది నర్సీపట్నం ఈ ప్రాంత ముఖద్వారం కావడంతో పరిసర మండలాలు చింతపల్లి జీకే వీధి నాతవరం గొలుగొండ కొయ్యూరు తదితర మండలాలకు చెందిన జ్వర పీడితుల తో తో ఆసుపత్రిలో నిండుతోంది ప్రధానంగా వాతావరణంలో మార్పులు రావడం కారణంగానే జ్వరాలు విస్తృతంగా ప్రబలుతున్నాయి రోగుల వాపోతున్నారు ఈ క్రమంలోనే ప్రాంతీయ ఆసుపత్రి లో శనివారం ఒక్కరోజే 50 మందికి పైగా చేరారు వీరందరికీ అవసరమైన చికిత్స అందిస్తున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
Last Updated : Sep 14, 2019, 2:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.