ETV Bharat / state

'ప్రజలు బాధపడితే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు' - janasena at rajampeta kadapa district

ప్రజలను బాధపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని జనసేన పార్టీ నేతలు అన్నారు. కడప జిల్లా రాజంపేట పార్టీ కార్యాలయంలో విద్యుత్​ బిల్లులు పెంపు, ప్రభుత్వ భూములు అమ్మకాల నిర్ణయంపై.. నోటికి నల్ల రిబ్బన్​లు కట్టుకొని నిరసన తెలిపారు.

janasena protest againist to power bills
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన నిరసన
author img

By

Published : May 21, 2020, 2:34 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని జనసేన రాజంపేట పార్లమెంట్ బాధ్యుడు ముకరంచాంద్, నియోజవర్గం బాధ్యుడు మలిశెట్టి వెంకటరమణ ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయాలపై రాజంపేట పార్టీ కార్యాలయంలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా రద్దుల ప్రభుత్వంగా మారిందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం విఫలమైందని... నవరత్నాలు రాలిపోయాయని దుయ్యబట్టారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని చెబుతూనే పేద ప్రజల నడ్డి విరిగేలా రెట్టింపు చార్జీలు పెంచారన్నారు. ప్రజలు బాధపడితే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు.

ఇవీ చూడండి:

'పొరుగు సేవల సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.