ETV Bharat / state

'మాస్కులు ఉంటేనే సరుకులు ఇవ్వండి' - jammalamadugu latest news

మాస్కులు ఉంటేనే ప్రజలకు సరుకులు ఇవ్వాలని కడప జిల్లా జమ్మలమడుగులో పట్టణ పోలీసులు ఆదేశించారు. దుకాణ యజమానులతో నిర్వహించిన సమావేశంలో సీఐ మధుసూధనరావు మాట్లాడారు. మాస్కులు ఉంటేనే ప్రజలకు సరుకులు ఉవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి చేయవచ్చని సీఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోడ పత్రిక విడుదల చేసి యాజమానులకు అందజేశారు.

jammalamadugu police released poster regarding about masks
గోడ పత్రిక విడుదల చేసిన జమ్మలమడుగు పోలీసులు
author img

By

Published : Jun 19, 2020, 3:45 PM IST

మాస్కులు ఉంటేనే ప్రజలకు ఇంటి సరుకులు ఇవ్వాలని దుకాణ యజమానులను పోలీసులు ఆదేశించారు. ఈ విధానం పాటించని వారి గురించి పోలీసులకు సమాచారం అందజేయాలని సీఐ మధుసూధనరావు సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసులు ఓ గోడ పత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని దుకాణ యజమానులు హాజరయ్యారు. ఈ గోడ పత్రికను దుకాణదారులకు అందజేశారు. పోలీసులు నిఘా పెట్టినా... ఇంకా కొంత మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదని... వారిలో యువత ఎక్కువగా ఉండటం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : 'జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 20 కోట్లు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.