ETV Bharat / state

కరోనాతో చెలగాటం.. కారాగారంలో చేతివాటం

కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలో తనిఖీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో భద్రత సిబ్బంది కూడా తోటి సిబ్బందిని తనిఖీ చేయడం లేదు. ఇదే అదునుగా భావించి జైల్లో ఉన్న ఖైదీలతో జైలు అధికారులు కుమ్మక్కై వారికి కావాల్సిన సామగ్రిని అందజేస్తున్నారు. అధికారులే కాకుండా వైద్యులు కూడా ఖైదీలతో ఒక్కటై లక్షల రూపాయలు వెనకేసుకున్నారు. ఈ విషయంపై జైలు అధికారి రవికిరణ్‌ విస్తృత తనిఖీలు చేసి తప్పులు గుర్తిస్తున్నారు. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

author img

By

Published : Jul 20, 2020, 7:11 PM IST

jail officers geeting close with cuddapah prisoners and doing graud things
కడప కేంద్ర కారాగారం

కరోనాతో ఉపాధి కోల్పోతున్న వారు అధిక శాతమున్నారు. కానీ వీరు మాత్రం కరోనా ముసుగులో చేతివాటం ప్రదర్శించారు. అధికారులందరూ ఒకే విధంగా ఉండరనే విషయం బహుశా వీరికి తెలియకపోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. కరోనా నేపథ్యంలో కడప కేంద్ర కారాగారంలో తనిఖీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫలితంగా... కొంత మంది సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అడ్డంగా దొరికిపోతున్నారు. కొంతమంది ఖైదీలు కూడా అధికారులకు దొరికిపోవడం వల్ల వారిపై చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా వచ్చిన జైలు అధికారి రవికిరణ్‌ ఈ విషయంపై అప్రమత్తమయ్యారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. తప్పులను గుర్తిస్తున్నారు. గతంలో పని చేసి వెళ్లిన వైద్యులు కూడా చేతివాటం ప్రదర్శించి లక్షల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపైనా విచారణ జరుగుతోంది.

సిబ్బంది కొరతతో జైలు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. దీనికి తోడు.. కరోనా వైరస్‌ దృష్ట్యా కడప జైలు అధికారులు పక్కా కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తున్నారు. ములాఖత్‌లను కూడా రద్దు చేశారు. జైల్లోకి వచ్చే వారిని థర్మల్‌ పరికరంతో ఉష్ణోగ్రత తనిఖీ చేసి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తరువాతనే జైల్లోకి అనుమతిస్తున్నారు. ముఖ్యమైన కేసులైతే తప్ప ఎవరినీ రిమాండు ఖైదీలుగా తీసుకోవడం లేదు. రిమాండు ఖైదీలకు ప్రొద్దుటూరు జైలును కేటాయించారు. కరోనా నేపథ్యంలో భద్రత సిబ్బంది కూడా తోటి సిబ్బందిని తనిఖీ చేయడం లేదు. ఇదే అదునుగా భావించి కొంత మంది సిబ్బంది జైల్లో ఉన్న ఖైదీలతో కుమ్మకై వారికి కావాల్సిన సామగ్రిని అందజేస్తున్నారు. సిగరెట్లు, బీడీలు, తదితర వస్తువులు దొంగచాటుగా అందించి వారిచ్చే లంచాలు తీసుకున్నట్లు తెలిసింది.

ఇటీవల జైలు అధికారి రవికిరణ్‌ జరిపిన తనిఖీల్లో జైల్లో నలుగురు ఖైదీల వద్ద కొన్ని వస్తువులు బయటపడ్డాయి. వాటిని ఎవరు తీసుకొచ్చి ఇచ్చారనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జైల్లో గతంలో పని చేసి వెళ్లిన వైద్యులు ఖైదీలతో పూర్తి స్థాయిలో కుమ్మక్కయ్యారు. ఖైదీల వద్ద డబ్బులు తీసుకుని వారు బాగున్నప్పటికీ ఆరోగ్యం బాలేదని జైలు అధికారులకు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు జైలు అధికారులు తప్పనిసరిగా బయట ఆసుపత్రులకు పంపించాల్సిందే. దీంతో చాలా మంది ఖైదీలు గతంలో ఉన్న వైద్యులకు డబ్బులిచ్చి బయట ఆసుపత్రులకు వెళ్లే వారు. ఇలా దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద కూడా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. పైగా ఖైదీ అనారోగ్యంగా ఉన్నారని అతనికి పాలు, గుడ్డు, ప్రతి రోజు చికెన్‌, బ్రెడ్డు ఇవ్వాలని కూడా సిఫార్సు చేయించుకుంటారు. ఇలా గతంలో పని చేసిన వైద్యులు లక్షల రూపాయలు వెనకేసుకున్నారు. ఇలా చాలా కాలం నుంచి జరుగుతోంది. దీనికి సంబంధించి జైలు అధికారుల వద్ద కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. దీనిపై విచారణకు సిద్ధమవుతున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

కేంద్ర కారాగారంలో నిబంధనల ప్రకారం 130 మంది వార్డుర్లు ఉండాలి. కానీ 50 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 70 మంది సిబ్బంది కొరత ఉంది. ఉన్న వారితోనే విధులు చేయించుకుంటున్నారు. ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడడం వల్ల వారు ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా కరోనా వైరస్‌ ఎక్కువవుతున్న దృష్ట్యా సిబ్బంది చాలా సేపు విధులు చేయాలంటే భయపడుతున్నారు. సిబ్బంది కొరత వల్ల కేంద్ర కారాగారంలో ఖైదీలపై పూర్తి స్థాయిలో నిఘా కొరవడిందని చెప్పాలి.

ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి..

కేంద్ర కారాగారంలో జరుగుతున్న వాటిపై జైలు అధికారి రవికిరణ్‌ వివరణ కోరగా.. జైల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సిబ్బంది కొరత గురించి అధికారులకు తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్​పై గుంతకల్లులో హిజ్రాల అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.