కడపలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై దాడి చేసి అతని నుంచి 625 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవునికడపకు చెందిన నిత్యపూజయ్య నివాసంలో అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ చక్రవర్తి ఆధ్వరంలో దాడులు నిర్వహించారు. లక్ష 28 వేల రూపాయల విలువ చేసే 625 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, నాటుసారా తయారు చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చక్రవర్తి పేర్కొన్నారు.
ఇదీ చూడండి