ETV Bharat / state

"ఇడుపులపాయ"లో సద్దుమణగని ఆందోళన.. తగ్గేదే లే అంటున్న విద్యార్థులు - ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు లేని పాత క్యాంపస్‌కు రాత్రికి రాత్రే వెళ్లాలన్న అధికారుల తీరుపై..రెండో రోజూ విద్యార్థులు నిరసన తెలిపారు. పాత క్యాంపస్‌ వద్దు.. కొత్త హాస్టల్‌లోనే ఉంటామని తేల్చి చెప్తున్నారు. అర్థరాత్రి ఆడపిల్లలను క్యాంపస్ మారాలని చెప్పడం తప్పేనంటూ.. RJUKT కులపతి కేసీ రెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు.

"ఇడుపులపాయ"లో కొనసాగుతున్న ఆందోళన.. తగ్గేదే లే అంటున్న విద్యార్థులు

author img

By

Published : Mar 21, 2022, 7:04 PM IST

Updated : Mar 22, 2022, 7:02 AM IST

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండోరోజు కొనసాగింది. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవనాల్లోనే ఉంటామని.. పాత క్యాంపస్‌లో ఉండబోమంటూ నినదించారు. ఇదే విషయాన్ని స్పష్టం చేసేందు. పాత క్యాంపస్ నుంచి డైరెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు యత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేసి అడ్డుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత తలెత్తింది.

ఆదివారం అర్ధరాత్రి డైరెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థినులు..ధర్నా చేశారు. వర్సిటీ కులపతి కేసిరెడ్డి విజ్ఞప్తి మేరకు విద్యార్థినులు అయిష్టంగానే ఆదివారం ధర్నా విరమించారు. అయితే సోమవారం మధ్నాహ్నం మళ్లీ విద్యార్థినులు.. నిరసనకు దిగారు. పాత క్యాంపస్ ఆవరణలో ఎక్కడ చూసినా పుట్టలు, చెత్తాచెదారం పేరుకు పోయిందని.. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాత్‌రూంలు, స్నానపు గదులు సక్రమంగా లేవని వాపోతున్నారు. ఆడపిల్లలైన తాము ఇలాంటి చోట ఎలా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిభ ఆధారంగా ఇడుపులపాయ క్యాంపస్‌కు ఎంపికైతే.. ఒంగోలు క్యాంపస్‌కు సంబంధించిన విద్యార్థులను తమ క్యాంపస్‌లో ఉంచడంపై నిలదీస్తున్నారు. తమ ఇక్కట్లను చూసి వచ్చిన తమ తల్లిదండ్రులపై కూడా డైరెక్టర్ దుర్భాషలాడారని ఆరోపించారు. RJUKT కులపతి కేసీరె‌డ్డి పాత క్యాంపస్‌లో విద్యార్థినిలను..బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆడబిడ్డలను అర్ధరాత్రి తరలించడం తప్పేనంటూక్షమాపణలు కోరారు. ప్రభుత్వంతో చర్చించి.. సమస్యలు పరిష్కరిస్తానని.. వారికి నచ్చజెప్పారు.

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్ధినులను కలిసేందుకు వచ్చిన తెలుగుదేశం నేతలను వీరన్నగట్టుపల్లె వద్ద పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే తెలుగుదేశం నేతలు ధర్నాకు దిగారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరించలేని సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

సమస్యల పరిష్కారంపై..V.C చెంచు రెడ్డి సంబంధిత అధికారులతో చర్చిస్తుండగా విద్యార్థులు మాత్రం డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళన కొనసాగించాలనే భావిస్తున్నారు.

అసలు వివాదం ఏమంటే?
కనీస వసతులు కూడా కల్పించకుండా.. తమను కొత్త క్యాంపస్ నుంచి పాత క్యాంపస్ కు వెళ్లమని చెబుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన వసతులు కల్పించే వరకూ పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నఫళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు తెలిపారు.

3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.

ఆందోళనకు దిగిన విద్యార్థులపై డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో ధర్నాలో కూర్చున్న ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ఈ చర్యను విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. అందరూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి... ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులంతా వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని... లేదంటే పోలీసుల సాయంతో బలవంతంగా పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి హెచ్చరికలకు భయపడని విద్యార్థులు... మరింత గట్టిగా నినాదాలు చేశారు. ఆదివారం చీకటి పడిన తర్వాత కూడా సెల్‌ఫోన్ల లైటింగ్ వెలుగులో ఆందోళన కొనసాగించారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని... ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి చెప్పుకొచ్చారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఆర్జీయూకేటీ ఛాన్స్‌లర్ కె.చెంచురెడ్డి... సమస్యలు శాశ్వతం కాదన్నారు. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి :

Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం: నారా లోకేశ్‌

Last Updated : Mar 22, 2022, 7:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.