ETV Bharat / state

క్షణికావేశం.. భార్యను హతమార్చిన భర్త - కడప తాజా మర్డర్​ కేసు

కూతురి అంత్యక్రియలకు అయిన ఖర్చు... ఆ దంపతుల మధ్య గొడవలకు దారి తీసింది. తరచూ వాగ్వాదం జరిగేది. ఓ సందర్భంలో ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరింది. కోపోద్రిక్తుడైన భర్త... భార్య తలపై సుత్తితో బలంగా కొట్టాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఆమెను ఆసుపత్రికి తరలించాడు. ప్రమాదవశాత్తు కింద పడిందని కథలు అల్లాడు. విషయాన్ని గ్రహించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. అసలు విషయాన్ని బయటపెట్టారు.

Husband kills wife
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త
author img

By

Published : Dec 27, 2020, 4:22 PM IST

కడప ఓం శాంతి నగర్ కు చెందిన లక్ష్మయ్య, అన్నపూర్ణమ్మ హోమియోపతి వైద్యులు. వీరికి పదహారేళ్ల కుమార్తె ఉంది. బాలిక విదేశాల్లో ఉంటూ చదువుకుంటోంది. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే మృతి చెందింది. ఈ మేరకు తమ బిడ్డ మృతదేహాన్ని కడపకు రప్పించేందుకు ఐదు లక్షలు వెచ్చించారు. అప్పు చేసి ఆ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ విషయం పై భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి.

ఇదే క్రమంలో.. ఈ నెల 22వ తేదీ భార్యాభర్తల మధ్య వివాదం చేలరేగింది. కోపోద్రిక్తుడైన భర్త... భార్య తలపై సుత్తితో బలంగా కొట్టగా.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన భర్త.. ఆమె ప్రమాదవశాత్తూ కింద పడిందని.. తీవ్ర గాయమై చనిపోయిందని నమ్మించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సునీల్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ప్రియుడి మోసంతో యువతి ఆత్మహత్యాయత్నం.. 2 నెలలుగా కోమాలో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.