వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ తెదేపా నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకానంద భార్య సౌభాగ్యమ్మతో పాటు కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ పూర్తయింది. ఈ కేసుపై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. శవపరీక్ష నివేదిక, జనరల్ కేసు డైరీని ఇవాళ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సీఎం జగన్ గతంలో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు మెమో దాఖలు చేశారు. దీనిపై వివేకా కుమార్తె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు పిటిషన్ ఉపసంహరణపై జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వులో ఉంచింది.
వివేకా హత్య కేసు విచారణ.. హైకోర్టు తీర్పు రిజర్వు - వివేకానంద హత్యపై హైకోర్టులో విచారణ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది.

ఇదీ చదవండి: