కడపలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఈ వానకు నగరమంతా నీట మునిగింది. ఆర్టీసీ గ్యారేజ్‌లో మోకాలు లోతు వరకు నీరు చేరటంతో కార్మికులు అవస్థలు పడ్డారు. వీధులన్నీ జలమయమయ్యాయి. నబి కోట, ఎన్జీవో కాలనీ, భాగ్యనగర్, మృత్యుంజయ కుంట తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నీరు నిలిచి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. బుగ్గవంక ప్రాజెక్టుకు నీరు రావటంతో అధికారులు గేట్లు ఎత్తారు.
ఇవీ చదవండి..
గండికోట జలాశంలోకి భారీగా వరదనీరు.. ముంపు గ్రామాల్లో బాధితుల కష్టాలు