ETV Bharat / state

Heavy Rain in Kadapa: వైఎస్సార్, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రహదారులు

Heavy Rain in Kadapa: గురువారం తెల్లవారుజాము నుంచి వైఎస్సార్, కర్నూలు జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రోడ్లన్నీ జలమయం కావడంతో వర్షపు నీటిని తొలగించేందుకు నగరపాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 10, 2023, 1:36 PM IST

Heavy Rain in Kadapa and Kurnool District : కొన్ని రోజులు క్రితం భారీ వర్షాలు పడటంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. గురువారం తెల్లవారుజాము నుంచి రెండు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Heavy_rain_in_Kadapa: చెరువులను తలపిస్తున్న రహదారులు

Heavy Rain in Kadapa and Kurnool District : వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కడప నగరంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి నగరం జలమయమైంది. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీరు భారీగా చేరింది. కడపలోని చెన్నై రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేద్కర్ కూడలి, భగత్ సింగ్ నగర్, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లోని రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కయ్యపల్లెలోని పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళన గురయ్యారు.

Heavy Rains in AP: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వానలు.. బీభత్సం సృష్టిస్తోన్న వరదలు..

Heavy Rain in Kadapa and Kurnool District : కర్నూలులో ఈ రోజు ఉదయం కురిసిన వానకు కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటన్నర పాటు కురిసిన వర్షానికే నగరం జలమయం కావడంతో.. ఇక ఏకధాటిగా ఒక రోజు పాటు వర్షం కురిస్తే నగరం పరిస్థితి ఏమంటూ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్​లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మురికి కాలువలు వరద నీటితో నిండిపోయాయి.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన నగరపాలక అధికారులు : రోడ్లపై వెళ్తున్న పలు వాహనాలు సగం మేరకు మునిగియాయి. వర్షపునీటితో వాహనాలు మొరాయించాయి. మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో వర్ష నీరంతా రోడ్లపై ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు, మురుగు కాలువలను శుభ్రం చేయడానికి నగరపాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Rains in AP: ఏపీలో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో లంక గ్రామాలు..

వాహన దారులు తీవ్ర ఇబ్బందులు : ఒక మోస్తారుగా కురిసిన వర్షంతో వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా పట్టణంలోని నంద్యాల రోడ్డులో మురుగు కాలువ నుంచి నీరు రహదారిపైకి చేరింది. అందులోనే పాదచారులు, వాహనదారులు రాకలపోకలు సాగించాల్సి వచ్చింది. ఈ రహదారిపై ప్రయాణాలు సాగించడానికి వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సుమారు నాలుగు గంటలకు పైగా వర్షం : కర్నూలు నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. సుమారు నాలుగు గంటలకు పైగా వర్షం పడటంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Rains in AP: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.