దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా సాగాలంటే సీబీఐకి ఇవ్వాలని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. వైఎస్ వివేకా హత్య కేసులో కొన్ని రోజుల క్రితమే సిట్ అధికారులు బీటెక్ రవిని విచారించారు. కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రంలో 5 గంటల పాటు ఈ విచారణ జరిగింది.
సంబంధిత కథనం