కడప జిల్లాలోని పెనుశిల, లంకమల అభయారణ్యాల్లోకి ప్రవేశాలను ప్రభుత్వం నిషేధించింది. వన్యప్రాణులు కరోనా బారిన పడకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో సమీప గ్రామస్థులు అడవుల్లో నెలవైన క్షేత్రాలకు ఎవరూ వెళ్లరాదని ప్రభుత్వం పేర్కొందని అటవీ అధికారులు తెలిపారు.
జిల్లాలోని పెనుశిల 9వేలు, లంకమల అభయారణ్యం 11వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ రెండు అభయారణ్యాల్లో మల్లెం కొండ, లంకమల్లేశ్వర స్వామి క్షేత్రం వెలిసి ఉన్నాయి. కరోనా మహమ్మరి విస్తరించడంతో భక్తులు, పర్యాటకులు ఎవరూ వెళ్లరాదని...నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని అటవీశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చదవండి: