కడప జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మలేరియా బాధితురాలు మృతి చెందింది. తొండూరు మండలం సంతకొవ్వూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి.. మలేరియాతో బాధపడుతూ చికిత్స తీసుకుంది. ఆమె రక్తం వాంతులు చేసుకుంటున్న కారణంగా.. ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె మృతి చెందింది.
డాక్టరు కారణంగానే లక్ష్మీ దేవి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. శ్రీ రాజా రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీశారని బాధితులు ఆవేదన చెందగా.. వారికి పోలీసులు నచ్చజెప్పి అక్కడినుంచి పంపించారు.