డాన్స్ మాస్టర్‌గా జీవనోపాధి కోసం వచ్చి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది.
విశాఖకు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు రాజంపేటలో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారమందింది. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహించినవారు.. చంద్రశేఖర్ నుంచి సుమారు రూ.20 వేల రూపాయలు విలువచేసే 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి గంజాయిని తెప్పించి రాజంపేటలో విక్రయిస్తున్నట్లు చంద్రశేఖర్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: యువకుడిపై దాడి.. వైకాపా నాయకుల పనేనంటూ భాజపా ఆరోపణ