'కలెక్టర్ రావాలి... మా సమస్యలు తెలుసుకోవాలి' - గండికోట నిర్వాసితుల ఆందోళన
కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల ఆందోళన 7వ రోజుకు చేరింది. గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
'కలెక్టర్ రావాలి... మా సమస్యలు తెలుసుకోవాలి'
కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఏడో రోజు.. గ్రామంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
పరిహారం ఇవ్వడమే కాక... పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని ఖాళీ చేసేందుకు గడువు పెంచాలన్నారు. జిల్లా కలెక్టరు తమ ప్రాంతానికి వచ్చి సమస్యలను తెలుసుకోవాలని స్పష్టం చేశారు.