ETV Bharat / state

అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య - ధర్మాపురంలో రైతు ఆత్మహత్య వార్తలు

ఎనిమిదెకరాల పొలం. అంత సాగు భూమితో సరైన దిగుబడి.. గిట్టుబాటు ధర ఉంటే రైతు రాజులా బతకొచ్చు. ఆ లెక్క తప్పి... అప్పులు పెరిగిపోయి ఒక అన్నదాత ప్రాణాలు వదిలాడు. దాదాపు రూ. 10లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.

former suicide in dharmapuram kadapa district
ఆత్మహత్య చేసుకున్న రైతు రమణయ్య
author img

By

Published : Jul 4, 2020, 12:02 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురంలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమణయ్యకు 8 ఎకరాల పొలం ఉంది. గత కొన్నేళ్లుగా సరైన దిగుబడి, పంటకు రేటు లేక.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం అతనికి రూ. 10లక్షల వరకు అప్పు ఉంది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి మిద్దె పైకి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మధుసూదనరావు తెలిపారు.

ఇవీ చదవండి..

కొండాపురంలో గండికోట జలాశయం నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.