కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులపై... మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ను పోలీసులే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఊరు వదిలి వెళ్లిన క్రికెట్ బుకీలు మళ్లీ తిరిగి వచ్చారన్నారు.
పురపాలిక అధికారులు, పోలీసులు కరోనాను వరంగా మార్చుకొని అవినీతికి పాల్పడుతున్నారని వరదరాజులరెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి హత్య రాజకీయాలు చేశారన్న వరదరాజులరెడ్డి... తాను ఎమ్మెల్యే అయ్యాక పోలీసు అధికారులతో కలిసి ఫ్యాక్షన్ను తగ్గించ్చామన్నారు. కానీ ప్రొద్దుటూరులో ఇప్పుడు మళ్లీ ఫ్యాక్షన్ పెరిగిపోతోందని మండిపడ్డారు. సీఐ స్థాయి నుంచి డీఎస్పీ వరకూ ప్రొద్దుటూరులో అవినీతే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి:
సీమకు నీళ్లిస్తే.. సమర్థిస్తాం.: తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి