కడప జిల్లా దేవుని కడప రహదారిలోని పసుపు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు కర్మాగార యాజమాన్యం తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని అగ్న మాపక సహాయాధికారి మాధవ నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: