విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన పోలీస్ కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని... కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు నాగరాజు కుటుంబానికి... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా అధికారులు రూ. ఐదు లక్షలు చెక్కును అందజేశారు. పోలీసులు, హోంగార్డులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: