కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. అస్వస్థతకు గురై ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి 30 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఆసుపత్రికి రోజుకు 200 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పరిసరాలు బాగాలేక... దోమలు ఎక్కువగా ఉంటున్నాయని, మంచి నీరు శుభ్రంగా లేనందున జ్వరాల బారిన పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో మొత్తం 9 వేల మంది చదువుతున్నారు. ఆస్పత్రిలో దాదాపు అన్ని వార్డుల్లో జ్వర పీడిత విద్యార్థులు కనిపిస్తున్నారు. వీరిలో పలువురికి మలేరియా, టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.
ఇదీ చదవండి