ETV Bharat / state

అప్పుల బాధలకు మరో రైతు బలవన్మరణం - farmer sucide

అప్పుల బాధతో కడప జిల్లాకు చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రైతు
author img

By

Published : Sep 12, 2019, 7:18 AM IST

రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం జంగిటివారిపల్లిలో కొండేటి నాగరాజు(33) అనే రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు. కొన్నాళ్లుగా పంట దిగుబడి లేక అప్పుల్లో కూరుకుపోయాడు. దీనితో మనస్థాపానికి గురైన నాగరాజు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు తెలిపారు. వెంటనే అతన్ని కోడూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య ఉపాధి కోసం రెండు నెలల క్రితం కువైట్​కి వెళ్లింది. బంధువులు ఆమెను గ్రామానికి రప్పించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు: ఎమ్మెల్యే
నాగరాజు కుటుంబ సభ్యులను వైకాపా ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసరావు పరామర్శించారు. రైతులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకోవటం మంచిది కాదని ఎమ్మెల్యే అన్నారు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన ఊరేగింపులు కన్నుల పండువగా సాగాయి తొమ్మిది రోజుల పాటు ఉ పూజించిన వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించిన వాహనాల్లో ఉంచి ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు యువత పెద్దలు రంగులు పులుముకుని నృత్యాలు చేస్తూ సందడి చేశారు ఇక్కడ గోదావరి నది పాయలు వంటకాలు చెరువుల్లో గణనాథులను ఘనంగా నిమజ్జనం గావించారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:గణేష్ ప్రతిమలు

Conclusion:నిమజ్జనాలు ఊరేగింపులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.