అప్పుల బాధలు భరించలేక సుబ్బారెడ్డి అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా కలసపాడు మండలం శంకవరం గ్రామంలో నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. సరిగ్గా పంటలు పండక ఉరి వేసుకున్నాడు. జీవనాధారమైన పెద్దదిక్కును కోల్పోవడంపై.. కుంటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
సుబ్బారెడ్డికి గతంలో సొంత భూమి ఉండేదని కుంటుంబ సభ్యులు చెబుతున్నారు. వర్షాభావం, కరువు కాటకాలతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక.. బలవన్మరణానికి పాల్పడ్డాడని వాపోయారు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేసినా రుణాలే మిగిలాయన్నారు. అప్పుల వాళ్ల బాధలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడంటూ విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: