కడప జిల్లా ఖాజీపేట మండలం ములపాకలో హత్య కేసుకు సంబంధించి.. నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10న పొలం వద్ద కంపచెట్లను తొలగిస్తున్న షేక్ గౌస్‌పీర్‌పై కత్తులతో దాడి జరిగింది. కడప రిమ్స్‌కు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు.
ఈ హత్య కేసులో గౌస్‌పీర్ సోదరి ఖత్తల్‌సాబ్‌బషీరున్ ఆమె భర్త నాయబ్ రసూల్, వారి కుమారుడు నియాతుల్లా, అల్లుడు షేక్ ఖాసీంపీరాలు ప్రధాన నిందితులని డీఎస్పీ బి.విజయ్‌కుమార్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
భూమి తగాదాతోపాటు పాత కక్షలు మనసులో పెట్టుకుని గౌస్‌పీర్‌ను హతమార్చినట్లు వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డిలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: